పడిపోతే ప్రమాదమే.! కరెంటు సార్ జర చూడండి..! ==కింద ఏరులై పారుతున్న జలపాతం ఓరికి ఉన్న కరెంటు స్తంభం
అక్షర విజేత గోపాల్పేట్, రేవల్లి:
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రం నుండి కొంకలపల్లి గ్రామ మధ్యగల సరిహద్దున విద్యుత్ స్తంభం గత వానలకు కురిసిన నీళ్లు కల్మెట్ క్రింది భాగాన జలపాతగా పారుతుండడం జరిగింది. ఆ కల్మటుకు ఎదురుగా 11కేవీ, 33కేవీ ఓ విద్యుత్ స్తంభం పూర్తిగా ఒరిగి పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా కింద నీళ్ల తాకిడికి స్థలం ఇలా ఓరికి ఉండొచ్చు అని పలువురు అంటున్నారు. కావున విద్యుత్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని స్తంభాన్ని యధావిధిగా ఏర్పాటు చేయాలని ఆ చుట్టూ ఉన్న పంట పొలాల రైతులు అంటున్నారు.