గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ వార్షిక తనిఖీ
అక్షర విజేత గరిడేపల్లి
జిల్లా పోలీస్ అధికారి కే. నరసింహ శుక్రవారం గరిడేపల్లి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ సందర్భంగా సందర్శించారు. స్టేషన్కు విచ్చేసిన ఎస్పీకి ఎస్సై, సీఐ, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ స్టేషన్ రికార్డులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. విలేఖరులతో మాట్లాడుతూ ఎస్పీ గరిడేపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని 60 సీసీ కెమెరాలను కొత్తగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో క్రైమ్ నియంత్రణలో గణనీయమైన మార్పులు వస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గంజాయి అక్రమ రవాణా, రౌడీషీటర్లు, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు, పిడిఎస్ బియ్యం దుర్వినియోగం వంటి నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, హుజూర్నగర్ సీఐ చర ముందరాజు, గరిడేపల్లి ఎస్సై చలిగంటి నరేష్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.