*బ్రదర్ నందమూరి క్రిష్టర్ కి బిషప్ గా పదోన్నతి*
చిలకలూరిపేట అక్షర విజేత
* *యేసుక్రీస్తు దివ్య శాంతినిలయం* అధినేత, *ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్* నేషనల్ జాయింట్ సెక్రటరీ, *ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్* అడిషనల్ సెక్రటరీ, మరియు *పల్నాడు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు* బ్రదర్ నందమూరి క్రిష్టర్ కి, ఈ నెల 29 వ తేదీన డా. బి. ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట లో జరిగిన *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ* సమావేశం లో *బిషప్* గా పదోన్నతి కల్పించారు.
* గత *25 సం. లు* గా క్రైస్తవ సమాజానికి బ్రదర్ నందమూరి క్రిష్టర్ చేస్తున్న సేవలను గుర్తించి *బిషప్ గా పదోన్నతి* కల్పించామని రాష్ట్ర పాస్టర్ల సంఘం అధ్యక్షుడు *బిషప్ డా. ప్రతాప్ సిన్హా కొమానపల్లి* మరియు ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ *బిషప్ డా. డేనియల్ పాల్* తెలియజేసారు.
* ఈ పదోన్నతి ద్వారా *వేలాది మందికి పాస్టర్లు గా ట్రైనింగ్* ఇవ్వడానికి మరియు *చర్చీలను దేశ వ్యాప్తం* గా నిర్వహించ డానికి మరింత వెసులుబాటు కలుగుతుందని వారు తెలియ జేశారు.
* ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పాస్టర్ల అధ్యక్షులు మరియు జాతీయ స్థాయి నాయకులు హాజరయ్యారు.
* తనకు పదోన్నతి కల్పించిన జాతీయ, రాష్ట్ర నాయకులకు క్రిష్టర్ ధన్యవాదాలు తెలియజేసారు, మరియు *భారతీయ క్రైస్తవ సమాజంలో ఐక్యత, అభివృద్ధి* కొరకు మరింత పని చేస్తానని ఈ సందర్భంగా వారు తెలియజేసారు.