*బొలెరో వాహనాన్ని ఢీకొన్న గ్రానైట్ లారీ* *యడవల్లి వద్ద ఘటన, ఇద్దరికి తీవ్ర గాయాలు*
చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట మండలం యడవల్లి వద్ద జాతీయ రహదారిపై ఈ రోజు మెన్షన్ చేయవచ్చు, అందుబాటులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా విజయవాడ వైపు వస్తున్న బొలెరో వాహనాన్ని గ్రానైట్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది.ఈ ప్రమాదంలో బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. బొలెరోలో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
నరసరావుపేట నుంచి చిలకలూరిపేట వైపు వస్తున్న సమయంలో యడవల్లి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.