సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐక్యత పరుగు ==రేవల్లి ఎస్ఐ రజిత
అక్షర విజేత గోపాల్పేట్ ,రేవల్లి
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా 31/10/2025 వ రోజు ఐక్యత పరుగు కార్యక్రమం ఉంటుందని ఎస్సై రజిత తెలిపారు. ఎస్సై రజిత వివరాల ప్రకారం ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుందని. రేవల్లి కొత్త ఎమ్మార్వో కార్యాలయం భవనం రైస్ మిల్ కుంకలపల్లి రోడ్డు నుండి పోలీస్ స్టేషన్ వరకు ఉంటుందని ఈ కార్యక్రమం ద్వారా జాతి ఐక్యత, సామరహిత్య, దేశభక్తి వంటి విలువలను ప్రోత్సహించడం మా ముఖ్య ఉద్దేశం. కావున గ్రామ ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే యువత ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఎస్సై రజిత కోరారు. పూర్తి వివరాలకు 8712670615 సంప్రదించండి