*వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి* *తండ్రి అస్తికలు గంగలో కలపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన మహిళ.*
అక్షర విజేత, ఇబ్రహీంపట్నం :-
బాటసింగారం వద్ద బ్రిడ్జి దాటుతుండగా ప్రమాదం ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయిన మహిళ మృతి చెందింది. చనిపోయిన మహిళ భువనగిరి కి చెందిన కృష్ణవేణి గా గుర్తింపు ప్రమాదం నుండి ఆమె భర్త బయటపడ్డాడు. చనిపోయిన మహిళ నెర్రెపల్లి మాజీ సర్పంచ్ తిరందాస్ రవీందర్ కూతురు అనారోగ్యంతో గత శనివారం మాజీ సర్పంచ్ రవీందర్ మృతి చెందారు. తండ్రి అస్థికలు గంగలో కలపడానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదంలో కృష్ణవేణి మరణించింది. ఐదు రోజుల వ్యవధిలో తండ్రీకూతుళ్ల మృతితో నెర్రెపల్లిలో విషాదచాయలు అల్లుకున్నాయి.