*పనిచేసే ప్రభుత్వం.. అనుభవజ్ఞుడైన నాయకుడు ఉండబట్టే ప్రాణ, ఆస్తినష్టం తగ్గింది : మాజీమంత్రి ప్రత్తిపాటి.*
పసుమర్రు అక్షర విజేత
• మొంథా తుపానుతో నిరాశ్రయులైన పసుమర్రు ఎస్టీ కాలనీ నిర్వాసితులకు రూ.3వేల నగదు, 25 కిలోల బియ్యం, 6 రకాల నిత్యావసరాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి.
• గత పాలకులు ప్రజల్ని గాలికి వదిలేసి.. రోడ్లు, డ్రైనేజ్ ల నిర్వహణను పట్టించుకోనందునే నేడు ప్రజలకు కష్టాలు : ప్రత్తిపాటి.
తుపాను విలయంతో ఇళ్లు కోల్పోయిన వారు ఇంటి నిర్మించుకుంటే ప్రభుత్వ సాయం అందేలా చూస్తామని, ఇంటి స్థలాలు కూడా త్వరలోనే ప్రభుత్వం మంజూరు చేస్తుందని, పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా అధికారులు చొరవచూపాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గురువారం రాత్రి ఆయన తుపాను వరదతో నీటమునిగి నిరాశ్రయులైన పసుమర్రు ఎస్టీ కాలనీ నిర్వాసితులకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఆర్థిక సాయం, బియ్యం, 6 రకాల నిత్యావసరాలు అందించారు. ఇంటిలో ఒక్కరుంటే రూ.1000లు 25 కేజీల బియ్యం... నిత్యావసరాలు.. ఇద్దరుంటే రూ.2,000, బియ్యం, నిత్యావసరాలు.. ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రూ.4,000 బియ్యం నిత్యావస రాలను 205 మందికి ప్రత్తిపాటి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాసితుల్ని ఉద్దేశించి మాట్లాడారు.
పసుమర్రు గ్రామస్తులు, అధికారులు సకాలంలో స్పందించి ఎస్టీ కాలనీలో ప్రాణనష్టం జరక్కుండా సకాలంలో స్పందించి ప్రజల్ని కాపాడారని ప్రత్తిపాటి చెప్పారు. పనిచేసే ప్రభుత్వం ఉంటే ప్రజలకు, రాష్ఠ్రానికి ఎలాంటి నష్టం జరగదని మరోసారి కూటమిప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం నిరూపించిందన్నారు. గత ఐదేళ్లు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి, పల్లెలు.. పట్టణాల్లో రోడ్లు, డ్రైనేజ్ ల వ్యవస్థను పట్టించుకోనందునే, మొంథా తుపాను తీవ్రత వల్ల వరదనీరు పొలాల్ని, ఇళ్లను ముంచేసిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతపాలకులు ఉంటే ప్రజల బతుకులు నీళ్లలోనే తెల్లారిపోయేవని ప్రత్తిపాటి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ మొంథా తుపాను ఏర్పడింది మొదలు ఈ రోజువరకు కూడా నిత్యం రాత్రింబవళ్లు పర్యవేక్షించి, సమర్థతతో రాష్ట్రంలో ఆస్తి.ప్రాణనష్టం లేకుండా చూశారన్నారు. చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు ఉండబట్టే.. మొంథా ప్రభావం రాష్ట్రంపై అధికంగా ఉన్నా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కూడా వేగంగా స్పందించి ప్రజలకు అండగా నిలిచిందన్నారు భవిష్యత్ లో పసుమర్రు గ్రామానికి ఎలాంటి వరద లేకుండా చూస్తామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, మండల అధ్యక్షులు జవ్వాజి మధన్ మోహన్, తేళ్ల సుబ్బారావు, ఎమ్మార్వో షేక్ మహమ్మద్ హుస్సేన్, గ్రామ నాయకులు జాలాది సుబ్బారావు, కొడాలి శ్రీనివాసరావు, చైతన్య, గద్దె చౌదరి, కిషోర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ఎంపీడీవో, అధికారులు , టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.