*మహేశ్వరంలో పోలీస్ అమరావీరుల దినోత్సవ వార్షికోత్సవాలు* *రక్తదాన శిబిరంలో పాల్గొన్న డిసిపి సునీత రెడ్డి*
*అక్షర విజేత మహేశ్వరం*
రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్, ఆదేశాల మేరకు పోలీస్ అమరవీరుల దినోత్సవ వారోత్సవాలను అక్టోబర్ 21 నుండి 31 వరకు నిర్వహించమని ఆదేశాలు ఇవ్వగా, సిపి సార్ ఆదేశాల మేరకు 30.10.2025 నాడు మహేశ్వరం డివిజన్ పరిధిలోని మహేశ్వరం పోలీస్ స్టేషన్ శివగంగా టెంపుల్ వద్ద మహేశ్వరం డిసిపీ సునీత రెడ్డి, ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ వారు రక్తదాన శిబిరాన్ని నిర్వహించగా మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, ప్రారంభించరు, ఈ యెక్క ప్రోగ్రామ్ లో మహేశ్వరం డివిజన్ పరిధిలోగల నాలుగు పోలీస్ స్టేషన్ ల సి.ఐ.ఎస్.ఐ లు, సిబ్బంది. మహేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు యువకులు, మహేశ్వరంలోని వివిధ కంపెనీలు మలబారు , విప్రో, ప్రీమియర్ , సిగ్నీ , వనమాలి , శ్రీనాథ్ రోటో ప్యాక్ , టాటా టీ కంపెనీ లలో పనిచేసే కార్మికులు, కంపెనీ యాజమాన్యం అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో సుమారు 500 మంది పాల్గొనగా, అందులో 300 మంది వరకు రక్తదానాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యెక్క ప్రోగ్రామ్ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేశ్వరం జోన్ డిసిపి సునీత రెడ్డి, మహేశ్వరం ఎసిపి జానకి రెడ్డి , మహేశ్వరం పి.ఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, కందుకూరు పి.ఎస్ ఇన్స్పెక్టర్ సీతారాం, పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి, బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐలు, సిబ్బంది, మహేశ్వరం మండల వివిధ గ్రామ ప్రజలు యువకులు పాల్గొనరు,