దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎంతటి కష్టం.! చేతికొచ్చిన పంట నీటి పాలు రైతన్న కంట నీరు..!! == తుఫాను అకాల వర్షాల కారణ నీట మునిగిన పంటలు ==1 లక్ష
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల కేంద్రంలో అకాల వర్షం తుపాను కారాల వల్ల 5 ఎకరాల వరి పంట నీట మునిగిన ఘటన గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది రైతు బత్తుల శ్రీశైలం యాదవ్ వివరాల ప్రకారం వరి కోత కోసే సమయానికి ఇలా జరగడం పంట మొత్తం నీట మునిగి మొలకలు రావడం చూసి ఆ రైతు కుటుంబం కంటతడి పెడుతున్నారు. 5 ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరా కు 7000 చొప్పున 5 ఎకరాలకు 35000 నష్టం అయ్యానని అదేవిధంగా ఎకరాకు పెట్టుబడి 20,000 పెట్టుబడి 5 ఎకరాలకు మొత్తం 1 లక్ష రూపాయలు అయిందని రైతు దిగులుగా నెత్తికి చేతులు పెట్టుకొని ఏమి ఏం చేయాలి స్థితిలో బాధపడుతూ మొత్తం 1 లక్ష 35వేల రూపాయలు నష్టం జరిగిందని కావున ఈ పేద రైతును ఎలాగైనా ప్రభుత్వం ఆదుకోవాలని రైతు బత్తుల శ్రీశైలం యాదవ కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు