*జంట జలాశయాలకు భారీగా వరద నీరు* *నిండుకుండల్లా మారిన రెండు జంట జలాశయాలు* *గండిపేట్ ఆరు గేట్లు, హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు, ఎత్తివేత* *లోతట్టు ప్రా
*అక్షర విజేత రాజేంద్రనగర్*
జంట జలాశయాలైన గండి పేట హిమాయత్ సాగర్ లు నిండుకుండల్లా మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు.హిమాయత్ సాగర్, గండి పేట్ జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండిపోతున్న సమయంలో అధికారులు మిన్నకుండిపోయారు. దీంతో పూర్తిగా నిండిన తర్వాత హడావుడిగా గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ పరివాహాక ప్రాంతాలు నీట మునిగాయి.
హిమాయత్ సాగర్, గండిపేట్ ల నీటి విడుదలలో ఎలాంటి జాప్యం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించడంతో పెను ప్రమాదం బారిన పడకుండా చేశారు.తాజాగా కురుస్తోన్న వర్షాలకు రెండు జంట జలాశయాలకు వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు గండిపేట్ లో ఆరు గేట్లు, హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు, నీటిని దిగువకు వదులుతున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. గండిపేట్ నుంచి భారీగా నీటి విడుదల చేయడంతో నార్సింగి, మున్సిపాలిటీ మంచిరేవుల మధ్య ఉన్న కల్వర్టుపై, హిమాయత్ సాగర్ భారీగా వరద నీరు సర్వీస్ రోడ్ పై నుంచి నీరు పారుతోంది. దీంతో అధికారులు ఈ కల్వర్టుపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.