ఎమ్మెల్యే మెగా రెడ్డి వెయ్యి కోట్ల నిధులు ఎక్కడ.? వనపర్తి అభివృద్ధిపై శ్వేతా పత్రం విడుదల చేయాలి. కేవలం 20 శాతం మ్యాచింగ్ గ్రాంట్ కే కాంగ్రెస్ నాయక
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే
మేఘా రెడ్డి సీఎం ప్రకటించిన వెయ్యి కోట్ల నిధులు ఎక్కడ? శ్వేత పత్రం విడుదల చేయాలని
యాసంగి సీజన్ సన్న వడ్ల బోనస్ దాదాపు 48 కోట్లకై 4 నెలలుగా రైతుల ఎదురుచూపులు ఇవ్వాలని
మర్రికుంట చెరువు అరువు నీటికై కల్వర్టు కాంగ్రెస్ ప్రభుత్వం లోనే కట్టారు నాయకులు గమనించాలని
విజ్ఞులైన వనపర్తి ఓటర్లు అభివృద్ధిని అభివృద్ధి చేస్తున్నట్లు చేసే ప్రచారాన్ని అంతా గమనిస్తున్నారు ఈ సందర్భంగా తెలియజేశారు
కాంగ్రెస్ పాలనలో రైతులకు యాసంగి సన్నాల బోనస్ బకాయి మరియు అలుగునీటి సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం. ఈ సందర్భంగా హెచ్చరించారు
వనపర్తి బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు డి.నారాయణ ఆధ్వర్యంలో పాతికేయ సమావేశం నిర్వహించారు
ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షులు డి నారాయణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్స్(యు ఐ డి ఎఫ్ ) ద్వారా 11 మున్సిపల్ కార్పొరేషన్లు 36 మున్సిపాలిటీలలో డ్రైనేజీ, సిసి రోడ్లు, త్రాగునీరు సరఫరాకై 2954.52 కోట్లు మంజూరు చేసిందని అందులో కేంద్ర ప్రభుత్వం నేషనల్ హౌసింగ్ బ్యాంకు(ఎన్ హెచ్ బి ) ద్వారా 80% నిధులు 2352.42 కోట్లు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 523 కోట్లలో వనపర్తి మున్సిపాలిటీకి 18.70 కోట్లలో 15 కోట్లు వాటా,3.70 కోట్లు రాష్ట వాటా అని మున్సిపల్ కార్యదర్శి స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగిందని కానీ స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కాంగ్రెస్ నాయకులు పూర్తిగా రాష్ట్ర బడ్జెట్ మేమే ఇస్తున్నామని ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని 80% నిధులను ఆధారాలతో సహా ఏ వేదిక ద్వారానైనా నిరూపించడానికి బిజెపి సిద్ధంగా ఉందని, సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి కోట్ల నిధులపై ఎమ్మెల్యే మేఘా రెడ్డి కి వనపర్తి ప్రజల పట్ల అభిమానం చిత్తశుద్ధి ఉంటే జీవోలు,ఆర్థిక శాఖ అనుమతులు ఎక్కడెక్కడ శంకుస్థాపనలు జరిగి పనులు కొనసాగుతున్నాయో ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు సీఎం ని కలవడం ఆనవాయితీ అని కలిసిన ప్రతి సందర్భంలో 100, 200 కోట్ల నిధులు వనపర్తికి సాధించానని పత్రికల్లో రాయించుకుని ఆనందపడితే అది అభివృద్ధి కాదని ఇది పూర్తిగా కాంగ్రెస్ అబద్ధాల పాలనని ఆవేదన వ్యక్తం చేశారు
వర్షాకాల ధాన్యానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి యాసంగి సీజన్లో రైతులకు బకాయి పడ్డ సన్నాళ్ల బోనస్ డబ్బులు రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని 4 నెలలుగా రైతులు వ్యవసాయ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని వరి ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వానికి రైతులకు మధ్య నోడల్ ఏజెన్సీగా ఉంటున్న పౌరసరఫరాల సంస్థ రైతులకు మద్దతు ధర ప్రకారం వారం లోపు అకౌంట్లో డబ్బులు వేస్తే రాష్ట్ర ప్రభుత్వ మాత్రం నాలుగైదు నెలలుగా రైతులను బ్యాంకుల చుట్టూ తిప్పుతున్నారని జిల్లాలోని రైతులకు బోనస్ బకాయిలను విడుదల చేయించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి బిజెపి కలెక్టరేట్ ముట్టడిస్తుందని హెచ్చరించారు.
సమావేశంలో అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ రాకాసి లోకనాథ్ రెడ్డి సర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షులు మెంటే పల్లి పురుషోత్తం రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు శ్రీనివాస్ గౌడ్ మీడియా కన్వీనర్ తిరుమలేష్ కార్యాలయ కార్యదర్శి ఆగపోగు కుమార్ పట్టణ అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు