ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలందరికీ ఇల్లు నిర్మించి ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్, మార్కెట్ డైరెక్టర్ సాయిని అశోక్, సొసైటీ డైరెక్టర్ సంజు, మైనార్టీ అధ్యక్షులు నయీమ్, సాయిని బస్వరాజ్, బాలకృష్ణ, చింతల హన్మండ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.