భారీ వర్షం వల్ల మండలం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ప్రజల భద్రత, మా బాధ్యత సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ యం నవీద్
అక్షర విజేత కృష్ణ
కృష్ణ మండల సబ్ ఇన్స్పెక్టర్ నవీద్ మండలం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాతావరణ శాఖ సమాచారం ప్రకారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని కావున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అవసరం లేకపోతే బయటకు వెళ్ళవద్దు అలాగే విద్యుత్ తీగలు, చెట్లు, నీటి ప్రభసాల దగ్గరకు వెళ్లొద్దు. ఇండ్లలోనే సురక్షితంగా ఉండండి అని దీంతోపాటు రైతులు తమ పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ఎవరికి ఎలాంటి ప్రమాదం గానీ అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే కృష్ణ పోలీస్ స్టేషన్ సంప్రదించండి అని అలాగే 100 డయల్ ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని. ప్రజల భద్రత మా బాధ్యత అని సబ్ ఇన్స్పెక్టర్ నవీద్ తెలిపారు.