*60 శాతం ఉన్న బీసీలకు42 శాతం న్యాయం చేయని అసమర్థ ప్రభుత్వం* *సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలె* *బి.ఆర్.కృష్ణ ముద
అక్షరవిజేత
, వికారాబాద్ ప్రతినిధి
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు, తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి ప్రముఖులైన బిసి న్యాయవాదులను పెట్టి "స్టే" తీసుకొచ్చి 42 శాతం బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బి ఆర్ కృష్ణ ముదిరాజ్ సూచన చేశాడు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 137ని సూచిస్తుంది. సుప్రీంకోర్టుకు తన నిర్ణయాలను స్వయంగా సమీక్షించుకునే అధికారం ఉంటదని న్యాయం ఉంటే "స్టే ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని అన్నారు. అన్ని అవకాశాలు
ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమైన నిర్వహణ కారణంగా గవర్నర్ కు ఆర్డినెన్స్ అమలు కాకపోవడం, జీవో నంబర్ 9పై హైకోర్టులో స్టే ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ తిరస్కరించిందని ఇది కారణం అని చూపించారు, కానీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు శాస్త్రీయమైనవి సమగ్రమైనవి వాదనలు చేయకపోవడంతో, తెలంగాణలో గ్రామాలలో పట్టణాల్లో మేయర్స్ చైర్మన్ కార్పొరేటర్స్ కౌన్సిలర్స్ చాలా రిజర్వేషన్లు నష్టపోతున్నారు. గ్రామాలలో బీసీ జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, వేయిలాది రిజర్వేషన్లు నష్టపోతున్నారు. సర్పంచ్లు అయితే స్వతంత్రం వచ్చి,79 సంవత్సరాల నుండి లక్షలాది సర్పంచుల రిజర్వేషన్లు నష్టపోతున్నారనీ ఉన్నారు.నోటి కాడికి వచ్చిన బీసీల రాజకీయ భవిష్యత్తును బీసీల బతుకులను బజారు పాలు చేసిందని బిఆర్ కృష్ణ ముద్రాజ్ తీవ్రంగా విమర్శించారు. ఇక విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేక, లక్షలాది ఉద్యోగాలు నష్టపోతున్నారు.బీసీ లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక పట్టణాల్లో హోటలల్లో స్విగ్గిలలో రకరకాల కూలి నాలి చేస్తూ కఠితమైన బతుకులు బతుకుతున్నారు అని బిఆర్ కృష్ణ ముదిరాజ్ ఆవేదన వ్యక్తపరిచినారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న ఈ ప్రభుత్వానికి చీమకుట్టినంత సోయి లేదనీ , గ్రామాలలో పట్టణాల్లో ప్రజా ప్రతినిధులు లేక సరైన రోడ్ లేక సరైన కరెంటు లేక మౌలిక వసతులు లేక గ్రామీణ ప్రజలు కష్ట నష్టాలు పడుతున్నారనీ ఆవేదనను వ్యక్తం చేశారు.రెండున్నర కోట్లు బీసీలకు సరైన న్యాయం చేయక,యావత్తు బీసీల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా చేసిందని సగం తెలంగాణ ను బజారు పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అని ఆయన ఆరోపించారు.యావత్తు తెలంగాణ బిసి ప్రజలు రోడ్లపైకి వచ్చి న్యాయము న్యాయం అని కేకలు వేస్తుంటే మా బీసీ బంధువుల అర్ధనాదాలు ఈ గుడ్డి ప్రభుత్వానికి వినిపిస్తే లేదా? అని బి ఆర్ కృష్ణ ముదిరాజ్ ఆశ్చర్యపోయినాడు. సత్వర మార్గాలు చాలా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానం అమలు చేయండి, బీసీల రాజకీయ భవిష్యత్తును రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నాడు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసి స్టే తీసుకొని అంత లోపల అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి మోడీకి మా బీసీల సాధక బాధకాలు వివరించి, మోడీని ఒప్పించి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ,బిల్లు పెట్టి పాసు చేయించి 9వ షెడ్యూల్లో పెట్టించాలని అప్పుడే బీసీలకు 42 శాతం రాజ్యాంగ భద్రత కలుగుతదిఅని బి ఆర్ కృష్ణ ముదిరాజ్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేసినారు లేని యెడల లక్షలాది బీసీలు, సగం తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వచ్చి ధర్మ పోరాటం చేస్తారనీ రాష్ట్ర ప్రభుత్వానికి, బి.ఆర్. కృష్ణ ముదిరాజ్ హెచ్చరించారు.