సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతారావు ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోయా క్వింటాలుకు రూ.5328 ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. అవునా రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.