???? తూఫాన్ ప్రభావంతో గరిడేపల్లిలో రైతుల పంటలు నాశనం ????
అక్షర విజేత గరిడేపల్లి
గరిడేపల్లి మండల కేంద్ర పరిధిలో తూఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, గాలులతో కలిసి వరి పంటలు నేలమట్టం అయ్యాయి. నెలరోజులకే త్రివరంగా వరిగిన పంటలు నీట మునిగి భారీ నష్టం వాటిల్లింది.
యూరియా ఎరువు దొరకక ఇబ్బందులు పడుతున్న రైతులు ఎంతో కష్టపడి వేసిన పంట ఇప్పుడు తీరని లోటుగా మారిందని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంలో బి.ఆర్.ఎస్. పార్టీ తరపున కొత్తగూడెం మాజీ ఎంపీటీసీ కడియం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ —
> “రైతులు ఆరు గలాలు కష్టపడి సాగు చేసిన పంట నేలకొరిగింది. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను అన్నదాతలుగా గుర్తించి సాయం అందించాలి” అని డిమాండ్ చేశారు.