*ఎడ్లపాడు-జగ్గాపురం రోడ్డుపై ఎస్ఐ శివరామకృష్ణ సహాయక చర్యలు!* *ప్రజలకు రాకపోకలు సులభతరం చేసేందుకు దగ్గరుండి తొలగింపు పనులను పర్యవేక్షణ* ఎడ్లపాడు
అక్షర విజేత
ఎడ్లపాడు నుండి జగ్గాపురం వెళ్లే రహదారిపై ఇటీవల కురిసిన భారీ వర్షాలు/వీచిన ఈదురు గాలుల కారణంగా విరిగిపడిన చెట్లు మరియు కరెంట్ పోల్స్‌ను స్థానిక ఎస్ఐ టి. శివరామకృష్ణ దగ్గరుండి తొలగించారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లు, పోల్స్ వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, విషయం తెలుసుకున్న ఎస్ఐ శివరామకృష్ణ వెంటనే స్పందించారు.పోలీస్ సిబ్బంది మరియు స్థానిక పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకొని, ఆయన స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షించారు. పెద్ద పెద్ద చెట్ల కొమ్మలను, విరిగిపోయిన తొలగించే పనులలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.