*సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిధులపై ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆవేదన*
అక్షర విజేత, హైదరాబాద్ బ్యూరో:
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రాంట్ ఇన్ ఏడ్ కేటాయింపులపై తక్షణమే పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జనాభా లెక్కలు,మౌళిక సౌకర్యాల ప్రకారం నిధులు కేటాహించారా అని ప్రశ్నించారు. సుమారు 4 లక్షల జనాభా ఉన్నా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కు కేవలం 2.8 కోట్లు కేటాహించడాన్ని అయన తీవ్రంగా వ్యతిరేకంచారు.ఇది అన్యాయని, స్థానిక ప్రజల పై వివక్ష చూపారని ఆయన స్పష్టం చేశారు.
భారీ జనాభా ఉన్న క్లాస్-వన్ కంటోన్మెంట్కి కేవలం 2.82 కోట్లు కేటాయించడం అవమానకరమని, ఇది అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే అన్నారు.డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పే బీజేపీ నేతలు కంటోన్మెంట్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, కంటోన్మెంట్ బోర్డులో బీజేపీ నామినే టెడ్ సభ్యురాలు, మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు బీజేపీపార్టీ ఐనా.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు అవసరమైన నిధులు ఇవ్వడంలో వివక్ష చూపారని పేర్కొన్నారు. 50 వేల జనాభా ఉన్న చిన్న కంటోన్మెంట్లకు 6 కోట్ల నుండి 25 కోట్ల వరకు కేటాయించిన కేంద్రం అసమానత,రాజకీయ పక్షపాతం ఉన్నట్టు చూపిస్తోందన్నారు.ఈ నిర్లక్ష్యానికి నామినేటెడ్ సభ్యురాలు, మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.కనీసం 20 కోట్ల రూపాయలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు తీసుకుని రావాలని ఎంపీ ఈటలకు రాజేందర్ కు సవాల్ విసిరారు..