*ప్రకృతి విపత్తుల నుంచి ప్రజల్ని కాపాడటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా: మాజీమంత్రి ప్రత్తిపాటి*.
చిలకలూరిపేట అక్షర విజేత
• ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ మొంథా తీవ్రతను పర్యవేక్షిస్తూ, రాష్ట్రప్రజలకు చిన్న ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నారు.
• పట్టణ మరియు శివారు ప్రాంతాల్లో పర్యటించి సుగాలీ కాలనీ ప్రాంతవాసుల్ని పునరావాస కేంద్రానికి తరలించిన ప్రత్తిపాటి.
• బస్సులు ఏర్పాటుచేసి ప్రజల్ని సురక్షితంగా సమీపంలోని పాఠశాలలకు తరలించి, భోజన వసతి కల్పించిన ప్రత్తిపాటి.
నియోజకవర్గంలో మొంథా తుపాను తీవ్రత దృష్ట్యా మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం సాయంత్రం పట్టణంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వివిధ విభాగాల అధికారులు.. కూటమి నాయకులు, టీడీపీ శ్రేణులు.. అనుబంధ విభాగాల సభ్యులతో కలిసి 25వ వార్డు (జాగుపాలెం), 28వ వార్డు (కొండ్రుపాడు), సుగాలి కాలనీల్లో పర్యటించారు. సుగాలి కాలనీ, చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజల్ని సమీపంలోని మున్సిపల్ పాఠశాలకు బస్సుల్లో తరలించే ఏర్పాట్లు చేసిన ప్రత్తిపాటి.. ప్రజలకు స్వయంగా ఆహారం అందించి వారికి ధైర్యం చెప్పారు.
*తమకు ఏ కష్టం రాకుండా చంద్రబాబు చూసుకుంటాడన్న ధైర్యంతో ప్రజలున్నారు...*
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ప్రభుత్వం.. అధికార యంత్రాంగం తుపాను పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, మంత్రులు ఎప్పటికప్పుడు తుపాను తీవ్రతను గమనిస్తూ, ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలు. సమస్యల పరిష్కారానికి తీవ్రంగా శ్రమిస్తున్నారని ప్రత్తిపాటి చెప్పారు. ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి కూడా మొంథా తీవ్రతపై సమీక్షించి, అధికారులకు సూచనలు, సలహాలు అందిస్తున్నారన్నారు. ప్రజలకు కష్టమొస్తే చంద్రబాబు నాయుడు ఒక్కక్షణం కూడా ఆలస్యం చేయరని, గతంలో రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి విపత్తులను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారో తెలిసిందేనని, వాటి బారి నుంచి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడటంలో ఆయన తర్వాతే ఎవరైనా అని ప్రత్తిపాటి తెలిపారు. రాష్ట్రానికి, ప్రజలకు అండగా నిలిచే నాయకుడు ఉండగా ఎవరికీ ఏ కష్టం రాదని, ఆ నమ్మకం, ధైర్యంతోనే ఏపీ ప్రజలు నేడు మొంథా సంగతి చంద్రబాబు చూసుకుంటాడని ధీమాగా ఉన్నారని ప్రత్తిపాటి పేర్కొన్నారు. స్థానిక యంత్రాంగం ఈ రాత్రి మరింత అప్రమత్తంగా ఉండాలని, తుపాను తీరాన్ని సమీపించినందున ప్రభావం అధికంగా ఉంటుందని ప్రత్తిపాటి సూచించారు. అర్థరాత్రి కూడా ప్రజలకు అందుబాటులో ఉండి.. వారికి ఏ కష్టం రాకుండా చూద్దామని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు.
ప్రత్తిపాటి వెంట జనసేన ఇంచార్జి తోట రాజారమేష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, పట్టణ అధ్యక్షులు పఠాన్ సమాధ్ ఖాన్, ప్రధాన కార్యదర్శి మద్దుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి బాబు, డిఇ అబ్దుల్ రహీమ్, మున్సిపల్ అధికారులు, టీడీపీ నాయకులు, వార్డు నాయకులు తదితరులున్నారు.