తుఫాన్ ప్రభావంతో 28వ తేదీ మంగళవారం విద్యా సంస్థలు కు శెలవు ప్రకటించిన కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు జిల్లా అక్షర విజేత
ఈ నెల 28 తేదీ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు,అంగన్వాడీ పాఠశాలలు,కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.మొంథా తుఫాన్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా నివారించే ఉద్దేశంతో జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఇతర విద్యాసంస్థలు అన్నింటికి 28 తేదీ సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు