ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, కేజీబీవీ,బీసీ వెల్ఫేర్ బాయ్స్,ఎస్సి వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్స్ ని సందర్శించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి
అక్షర విజేత,కంగ్టి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను, కేజీబీవీ,బీసీ వెల్ఫేర్ బాయ్స్,ఎస్సి వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్స్ లోని వడ్డనను,సోమవారం పరిశీలించిన సబ్ కలెక్టర్ ఉమా హారతి,ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం వంట చేశారా లేదా రోజు పరిశుభ్రమైన ఆహారాన్ని అందచేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో స్వయంగా చదివించి పరిశీలించారు. సబ్ కలెక్టర్ సందర్శించిన సమయంలో కొందరు విద్యార్థులు భోజనాలు చేస్తుండగా,కొందరు చదువుతుండగా, విద్యార్థులతో మాట్లాడారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలలో ఐమాక్స్ లైట్స్ అవసరం అన్నారు.కేజీబీవీలో విద్యార్థుల డార్మెటరీని పరిశీలించారు. బీసీ బాయ్స్ హాస్టల్ లో జరుగుతున్న పనులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా ఎలా ఉంది ఏమి ఇబ్బందులు ఉన్నాయో వార్డెన్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య, ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్,వార్డెన్ శివకుమార్,కేజీబీవీ వైస్ ప్రిన్సిపాల్ పిడి మహేశ్వరి,బీసీ హాస్టల్ హెచ్ డబ్ల్యుఓ పండరి, ఎస్సీ హాస్టల్ హెచ్ డబ్ల్యుఓ సురేష్, విద్యార్థులు పాల్గొన్నారు.