అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు వినతి పత్రం మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు
అక్షరవిజేత, రాజేంద్రనగర్ :
రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని, మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు నవోదయ యూత్ అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ లోని రోడ్డు భూగర్భ డ్రైనేజీ రిటర్నింగ్ వాల్ సమస్యను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ మార్కండేయ నగర్ కాలనీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. చూడాలని, ముఖ్యంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో రిటర్నింగ్ వాల్ విషయంలో ఏ విధంగా రాజీ పడకుండా పనులు త్వరిత గతిన పూర్తి చేసి.. ప్రజా సౌకర్యార్థం సహకరించాలని, రాజేంద్రనగర్ సర్కిల్ జిహెచ్ఎంసి ఈ ఈ నరేందర్ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్లు మరియు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థలు బాగు చేశామని, ఇంకా ఏమైనా పూర్తికాని పనులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఎమ్మెల్యే తెలియజేయడం జరిగింది.తమ సమస్యకు వెంటనే స్పందించి పరిష్కారానికి చొరవ చూపిన ఎమ్మెల్యే కాలనీవాసులు కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ కార్యక్రమంలో మార్కండేయ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు వీడెం రమేష్, ప్రధాన కార్యదర్శి శ్యాం కుమార్, మాజీ అధ్యక్షులు సలహాదారులు ఏర్వ సత్యనారాయణ, పగిడిమర్రి సూర్యనారాయణ, గద్దె యాదగిరి, నవోదయ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు కోట పవన్ కుమార్, యూత్ సభ్యులు యాదగిరి, భాస్కర్, బాత్కు విజయకుమార్,ప్రేమ్ గౌడ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.