ప్రతిభ పురస్కారాలు అందజేత
అక్షర విజేత పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో (తాడేపల్లిగూడెం)
ప్రతిభ గల విద్యార్ధులను ప్రోత్సహించాలనే మంచి ఆశయంతో ది. సిటిజెన్ కో ఆపరేటివ్ సొసైటీ ప్రతీ సంవత్సరం ప్రతిభా పురస్కారం అందచేస్తుందని స్థానిక బ్రాంచ్ మేనేజర్ పి. వినోద్ వర్మ తెలిపారు. బుధవారం స్థానిక బ్రాంచ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో 10 తరగతి, ఇంటర్ లో ప్రతిభ కనబరిచిన 7గురు విద్యార్థులకు , ఒక్కొక్కరికి రూ10,000 నగదు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమా ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు గరికపాటి బాపయ్య శర్మ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఈ సంస్థ చేస్తున్న ప్రతిభా పురస్కారాల పంపిణీ ని కొనియాడారు. ఏ. పి. ట్రాన్స్కో విశ్రాంత అధికారి , పి. వి. సుబ్బరాజు అవార్డ్ పొందిన విద్యార్థులను అభినందించారు. సంస్థ మాజీ రీజినల్ మేనేజర్ ఎమ్. నాగేశ్వరరావు, విద్యార్ధుల తల్లిదండ్రులు యండపల్లి శ్రీనివాస్ రెడ్డి, పూడి వి వి. సత్య నారాయణ , పల్నాటి బాబురావు సిబ్బంది ఎమ్ ఎస్ ఆర్ కె అయ్యప్ప, శివశ్రీ, దేవి, శ్రీనివాస్, పూర్ణాచారి పాల్గొన్నారు.