పింఛనుదారుల బకాయిలు వెంటనే చెల్లించాలి
అక్షర విజేత, పశ్చిమగోదావరి జిల్లా, బ్యూరో (తాడేపల్లిగూడెం)
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పింఛన్దారుల బకాయిలు వెంటనే చెల్లించాలని నాయకులు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు సంఘం స్థానిక యూనిట్ భవనము లో అధ్యక్షులు బి. హరికుమార్ అధ్యక్షతన బుధవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో అధ్యక్షులు బి. హరికుమార్, సంఘ సలహాదారు వి. కె. వీరారావు, ఉపాధ్యక్షులు ముత్యాల అర్జునరావు, ఓ. కృష్ణకుమారి, సంఘ కార్యవర్గ సభ్యులు గాజుల మురళి కృష్ణ, దాసం వెంకట రమణ, సి హెచ్. సూర్య ప్రకాశరావు, కె. తాతరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పెన్షనర్ల కు రావలసిన బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. తక్షణమే 12 వ వేతన సంఘం కమీషనరును నియమించి ఉద్యోగులకు, పెన్షనర్లకు 30% ఇంటిరిమ్ రిలీఫ్ ,తాత్కాలిక భృతి చెల్లించాలని డిమాండ్ చేసారు. సంఘ సభ్యులు మాట్లాడుతూ ఈ. హెచ్. ఎస్. కార్డు పై వైద్య సేవలు సరిగ్గా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ. హెచ్. ఎస్. పరిమితిని 2 లక్షల నుండి 5 లక్షల కు పెంచి అన్ని నెట్వర్క్ ఆసుపత్రి ల యందు వైద్య సేవలు బలోపేతం చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. భవిష్యత్ లో సంఘ భవనం వద్ద పెన్షనర్ల వాహనములు పెట్టుకొనుటకు నిర్మించే షెడ్ కు అయ్యే ఖర్చు సుమారు రూ50 వేలు భరిస్తానని సంఘ కార్యవర్గ సభ్యులు గాజుల మురళీ కృష్ణ ప్రకటించినందుకు ధన్యవాదములు తెలియచేసారు. ఈ సమావేశంలో సంఘ కోశాధికారి జనాబ్ ఎమ్. డి. ముస్తఫా , కార్యదర్శి వై. వి. ఎస్. మూర్తి , సంఘ కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు.