సమస్యలు పరిష్కరించండి
అక్షర విజేత పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో (తాడేపల్లిగూడెం)
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పారిశుధ్య, రక్షణ సిబ్బంది బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు అందడం లేదని, 50 నెలలుగా పిఎఫ్ బకాయిలు జమ కావడం లేదన్నారు. ఈ సమస్యలపై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, డి సి హెచ్ ఎస్, జిల్లా కలెక్టర్ ,ఉప ముఖ్యమంత్రి, స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు వినతి పత్రాలు అందజేసినా పరిష్కారం లభించలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందికి రూ18,600 జీతం ఇవ్వాలని జీవో ఉన్నప్పటికీ కాంట్రాక్టర్ రూ11, 100 ఇస్తున్నారన్నారు. కార్యక్రమానికి ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షులు ఓసూరి వీర్రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కే లక్ష్మీనారాయణ నేతృత్వం వహించారు. శానిటేషన్ సెక్యూరిటీ, సిబ్బంది నాగేంద్ర రమణమ్మ, సురేష్ కుమారి పాల్గొన్నారు.