షెడ్యూల్డ్ ప్రాంతం లో ప్రభుత్వ భూముల్లో ఆదివాసులే హక్కుదారులు.....ఆదివాసి సంక్షేమ పరిషత్
అక్షర విజేత. వెంకటాపురం. (నూగురు)
వెంకటాపురం మండల కేంద్రంలో బోదాపురం( జి) సర్వేనెం.38లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆదివాసీ రైతులకు పట్టాలు మంజూరు చేయాలని వెంకటాపురం మండల తహసిల్దారి గారికి బోదాపురం ఆదివాసులు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్షిక సతీష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై కుటిల కుతంత్రాలు చేస్తూ ఆదివాసి జీవన విధానాన్ని సంస్కృతి సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తూ ఆదివాసీల చట్టాలు నిర్వీర్యం చేస్తూ ఆదివాసులను జీవన,మరణ పోరాటంలోకి నెట్టు వేయబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వెంకటాపురం మండలం బోదాపురం( జి) సర్వేనెం.38.ప్రభుత్వ భూములు లో ఆదివాసి రైతులు సాగు చేసుకుంటుంటే అట్టి భూములపై ఆదివాసులకు హక్కు కల్పించమని అడిగితే ఫారెస్ట్ అధికారులతో కలిసి దౌర్జన్యంగా దుర్మార్గంగా ప్రభుత్వ ,పోడు భూముల నుంచి ఆదివాసులను తరిమి ప్రభుత్వం కుట్రపూర్తిగా లాక్కోవాలని చూస్తుందని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులు భూమి,అడవి పుట్టినప్పటి నుండి ఆదివాసులు అడవిలోనే జీవిస్తున్నారు అని బలమైన సాక్షాదారాలు ఉన్నప్పుడు ఆదివాసులు అడివిలో అక్రమ చొరబాటుదారులు కాదని హక్కుదారులని ఫారెస్ట్ అధికారులు గమనించాలని అన్నారు. బోధపురం(జి)సర్వే నెం.38 లో 115 మంది ఆదివాసి రైతులు 20 సం,ల నుండి సాగు చేసుకుంటున్నా భూములపై ఫారెస్ట్ అధికారులు ఆదివాసి రైతులను ఫారెస్ట్ భూమి అని అడ్డగించడం సరైన విధానం కాదన్నారు. ఆదివాసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడటమే కాకుండా ఆదివాసులపై దౌర్జన్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ ఆదివాసులను వేధిస్తున్నారని వాపోయారు. బోదాపురం(జి)సర్వేనెం.38 ప్రభుత్వ భూములో సాగు చేసుకుంటున్న ఆదివాసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, కంతి చందర్రావు, చింత సమ్మయ్య, పొడెం సత్తిబాబు, ఇర్ప శ్రీనివాసరావు, సోడి సారయ్య, పోడెం నవజీవన్ బాబు, సోడి కృష్ణ కంతి ప్రశాంత్, కట్టం సూరయ్య, కారం సురేష్, తెల్లం ఆనంద్ కుమార్, రేగ నాగేశ్వరరావు, గట్టుపల్లి ధనలక్ష్మి పూణెం రాజేశ్వరి. బాడిస లక్ష్మి శ్రావణి. నర్సమ్మ ఆదివాసి రైతులు, మహిళలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.