అన్నదాతలను విస్మసించిన పాలకులు...యూరియా కొరత తీర్చాలని డిమాండ్...సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
అన్నదాత కష్టాలను పట్టించుకోకపోతే కేంద్ర రాష్ట్ర పాలకులకు పుట్టగతులు ఉండవని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీరామ్ విమర్శించారు. యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పానగల్ అంబేద్కర్ చౌక్ నుంచిఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించి , ఆఫీస్ వద్దధర్నా నిరసన చేపట్టారు. డిప్యూటీ ఎమ్మార్వో అశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బస్తా ఏరియా కోసం నెలల తరబడి పంపిణీ కేంద్రాల వద్ద అన్న పానీయాలు మాని పడిగాపులు పడుతున్నారని కొందరు సొమ్మసిల్లి పడిపోగా మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఎన్నికల్లో వేదికలపై అన్నదాత దేశానికి వెన్నెముక అంటూ గొప్ప మాటలు చెప్పే పాలకులు, యూరియా లేక అల్లాడుతుంటే పంపిణీ కేంద్రాల వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. జిల్లాలో ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే ,మంత్రి యూరియా కేంద్రాల దగ్గరికి వెళ్లి వారి పరిస్థితి పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. యూరియా కొరత ఉండడంతో బస్తా యూరియా దక్కించుకునేందుకు క్యూ లైన్ లో రైతులు కొట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి ఉందన్నారు. యూరియా సరఫరా చేయాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్నిదన్నారు. వారి నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి రావలసిన యూరియా రాక ఇబ్బందులు వచ్చాయన్నారు. రైతుల కష్టానికి కారణం బిజెపి ప్రభుత్వమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి ముందే యూరియా తెచ్చుకోలేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం చేతకాని తనమే అన్నారు. ఈరోజు ప్రధానమంత్రి సీఎం ఎమ్మెల్యే ఎంపీ పదవులు రైతులు పెట్టిన బిక్షేనని పాలకులు గుర్తించకపోతే వచ్చే ఎన్నికల్లో రైతులు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఇప్పటికే రోడ్ ఎక్కారని ఆగ్రహం కట్టలు తెంచుకోకముందే జాగ్రత్త పడాలని హెచ్చరించారు. రైతు యూరియా కొడతను తీర్చకుంటే రైతులను సమీకరించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, సిపిఐ వనపర్తి పట్టణ కార్యదర్శి రమేశ్, చిన్న రాముడు, కమ్మావుపెంటయ్య, మాల కురుమయ్య, అంజి, సంతోష్, కుర్వ హనుమంతు, చిన్న కురుమయ్య, సహదేవుడు, మల్లెపు బాలస్వామి, కురుమమ్మ తదితరులు పాల్గొన్నారు