*పాన్ ఇండియా విద్య అవార్డు అందుకున్న ఆదం షఫీ
అక్షర విజేత చిలకలూరిపేట
పట్టణానికి చెందిన ప్రైవేట్ కంప్యూటర్ అధ్యాపకుడు షేక్. ఆదం షఫీ, పాన్ ఇండియా విద్యా అవార్డు అందుకున్నారు. ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో విద్య అవార్డు సోమవారం అందుకున్నారు. గత 13 సంవత్సరాలు పైబడి ప్రైవేట్ అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న ఆదమ్ షఫీ ఉచిత కంప్యూటర్ విద్యను విద్యార్థులకు నేర్పిస్తూ ఆదర్శంగా ఉంటున్నాడు. అంతేగాక గతంలో గవర్నమెంట్ ప్రాజెక్ట్ మెప్మా ద్వారా, అలాగే ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అనేకమంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ విద్య నేర్పించడం జరిగింది. దీనికి గాను పాన్ ఇండియా విద్యా అవార్డు అందుకున్నారు. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకుల ఫోరం ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు షేక్. జాఫర్, కాకుమాను. అంజన్ రావు, ఐ వి సుబ్బారావు, చుండి శివప్రసాద్, పార్థసారథి, మనోహర్ తదితర ఉపాధ్యాయులు అభినందించారు.