క్రీడాకారులకు ఎప్పుడు అండగా ఉంటా - శాప్ డైరెక్టర్ జగదీశ్వరి
అక్షరవిజేత / బుట్టాయగూడెం :
క్రీడలు మానసిక ఉత్తేజాన్ని కలిగించి శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయని స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి అన్నారు. అక్టోబర్ ఐదు నుండి ఎనిమిదో తారీకు వరకు జెసాఫ్ ఆధ్వర్యంలో అనంతపురంలో జరగనున్న జర్నలిస్టు క్రికెట్ పోటీలకు వెళుతున్న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టును ఆమె అభినందించారు. క్రికెట్ జట్టుకు ఆమె స్పోర్ట్స్ షూస్ ను అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు ఎల్లప్పుడు అండగా ఉంటుందని రాష్ట్రంలో వారి సంక్షేమం కొరకు కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. అనంతపురంలో జరిగే క్రికెట్ పోటీలకు వెళ్లే ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు క్రికెట్ కప్ తో తిరిగి రావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జట్టు సారథి మొడియం ప్రసాద్, నాగేంద్ర, రామకృష్ణ రాజు, మురళి, హరికృష్ణ, నాగార్జున పాల్గొన్నారు.