లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవు లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్ లు, ఆసుపత్రులపై నిఘా పెట్టాలి ఆడపిల్లలను న
అక్షరవిజేత., ఏలూరు:-
జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి ఛాంబరులో బుధవారం పిసి & పియన్డిటిపై డిఏసి సమావేశం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పి.జె. అమృతం మాట్లాడుతూ జిల్లాలో స్కానింగు సెంటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి పూర్తిస్థాయిలో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ లింగనిర్ధారణ పరీక్ష నిషేధిత చట్టం గురించి తెలుసుకుని అవగాహన చేసుకోవాలని కోరారు. ప్రతి ఆడబిడ్డ జన్మించడానికి, ఎదగడానికి, చదవడానికి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కృషిచెయ్యాలని కోరారు. ఐఎంఈ, పోలీసు టీమ్ లుగా ఏర్పడి డెకాయ్ ఆపరేషన్లను నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతగా మెలగాలని, లింగ నిర్ధారణ పరీక్షలు జరుగు తున్నట్లు వారి దృష్టికి వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని తెలిపారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆడపిల్లలు నిష్పత్తి తక్కువగా ఉన్న గ్రామాలలో ప్రత్యేక నిఘా పెట్టి, అక్కడ వారికి అవగాహన కల్పించి బాలికలు నిష్పత్తిని పెంచాలన్నారు. సంతాన ఉత్పత్తి సాఫల్య కేంద్రాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. సమాజంలో ఆడ, మగ అంతరాలు తొలిగెందుకు సంబంధిత వైద్యాధికారులు ప్రజలలో విస్తృత అవగాహన పెంచేలా నిరంతరం కృషిచేయాలని కోరారు. గ్రామాల్లో గర్భిణీ స్త్రీలకు అవగాహన కల్పించేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డియస్పి బి.శ్రవణ్ కుమార్,గైనకాలజిస్టు డా.లక్ష్మీకిరణ్, పిడియాట్రిషన్ డా.సుజాతా దేవి, ఎన్జీవో జ్యోతి, ఎన్జీవో శ్రీ శివకృష్ణ, డెమో ఇన్చార్జి డా.పూజ , లీగల్ కన్సల్టెంటు శ్రీవడ్డే రవి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.