ఒక్కరోజు శాస్త్రవేత్తగా పొన్ కల్ పాఠశాల విద్యార్థిని..
అక్షరవిజేత మామడ:
విద్యార్థులు పాఠశాలలో చదువుతున్నప్పుడు ఉపాధ్యాయుల ప్రేరణతో ఏదో ఒక రంగంలో స్థిరపడాలని కలలు కంటున్నారు శాస్త్రవేత్త కావాలని సైన్స్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి అలాంటి అభిరుచి ఉంటుంది. ఒక్క రోజుల శాస్త్రవేత్తగా ఉండడానికి మేకల కావ్య కు ఆ అవకాశం రానే వచ్చింది. ఈ విద్యార్థిని పొన్కల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నది సిఎస్ఐఆర్ మరియు సిసిఎంబి హైదరాబాద్ ఆధ్వర్యంలో ఒక్కరోజు శాస్త్రవేత్తగా ఏమేం చేయాలో పరిశీలించడానికి తన సైన్స్ టీచర్ విజయలక్ష్మి తో హైదరాబాద్ కి వెళ్ళింది మేకల కావ్య ఇంకేముంది తన ఆనందానికి అవధులు లేవు భవిష్యత్తులో తాను శాస్త్రవేత్త కావాలనుకుంటున్న దానికి తక్కువ సమయంలోనే అది నిర్మల్ జిల్లా నుండి తనొక్కరికే అంతటి ప్రతిష్టాత్మకమైన సంస్థనుసందర్శించే అవకాశం వచ్చింది అన్ని అంశాలను పరిశీలించింది తన కోరికను మరింతగా పదిల పరుచుకుంది భవిష్యత్తులో తాను తప్పకుండా ఒక గొప్ప శాస్త్రవేత్తగా నిలుస్తానన్న ధీమాను వ్యక్తం చేసింది ఇలాంటి అవకాశం అందుకున్న మేకల కావ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరవింద్ కుమార్ సైన్సు ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం తోటి విద్యార్థులు అభినందించారు.