గుమస్తా సంఘం అధ్యక్షులు గా బాల ఆంజనేయులు ...ప్రధాన కార్యదర్శి గా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవం
అక్షర విజేత, నిజామాబాద్ ప్రతినిధి :
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిసాయి. గుమస్తా సంఘంలో మొత్తం 300 మంది ఓట్లు ఉండగా 278 ఓట్లు పోలయ్యాయి. సోమవారం గుమస్తా సంఘంలో ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరిగాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల అధికారులు ఫలితాలు వెల్లడించారు. గుమస్తా సంఘం అధ్యక్షుడిగా బాల ఆంజనేయులు 204 భారీ ఓట్లతో ప్రత్యర్థి కొక్కు నర్సయ్య పై గెలుపొందారు. ప్రధాన కార్యదర్శి గా గట్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు గా రాజ్ గణేష్ 27 ఓట్ల తో గెలుపొందారు. కోశాధికారిగా వెంకటేష్ 20 ఓట్లతో గెలుపొందారు. సంయుక్త కార్యదర్శిగా శివ ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ సంబరాలు నిర్వహించారు. వ్యాపారులు గుమస్తా కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. దాడువాయి సంఘం అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ అభినందనలు తెలిపారు.