దళిత వాడకు దారేది...ప్రభుత్వలు మారిన దళితుల జీవితాలు మారడం లేదు
అక్షరవిజేత,వాజేడు :
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల గ్రామపంచాయితిలోని జగన్నాధపురంలో దళితులు నివసిస్తున్న వీది రోడ్డు చినుకు పడితే చాలు చిత్తడి అవుతుంది.కనీసం బురదలో క్రిమికీటకాలు పెరగకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లమంటే స్టాక్ ఇంకా రాలేదని పంచాయితీ కార్యదర్శి సమాధానం ఇచ్చారని దళితులు ఆవేదన చెందుతున్నారు.ఓట్ల సమయంలో నాయకులు మా ఇండ్లలోకి ఓట్లు అడుక్కుంటారు కానీ ఇప్పుడు రోడ్డు బాగుచేయ్యమని చెబితే ఎమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఇకనైనా కనీసం మట్టి గ్రావెల్ తో మా రోడ్డు బాగుచేయ్యాలని అధికారులను కోరుతున్నారు