గంజాయి విక్రయిస్తూ వ్యక్తులు అరెస్ట్.. రెండు కేజీల మూడువందల యాభై గ్రాముల గంజాయి.. రెండు సెల్ ఫోన్లు,రెండు బైకులు స్వాధీనం
అక్షరవిజేత,గరిడేపల్లి :
గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామ శివారులో నిషేధిత గంజాయిని శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు.పట్టణంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం రాయని గూడెం గ్రామ శివారులోని కాల్వపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పక్కన గల డంపింగ్ యార్డ్ లో చిలుకూరు మండలం బేతవోలు గ్రామానికి చెందిన గణపరపు శ్రీకాంత్, ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట గ్రామానికి చెందిన బొట్ల బాలకృష్ణ, హుజూర్నగర్ పట్టణానికి చెందిన షేక్ నజీర్, కొప్పుల శ్రీకాంత్ అని వ్యక్తులు గంజాయి క్రయ విక్రయాలు జరుపుతున్నారని సమాచారం మేరకు గరిడేపల్లి ఎస్సై చలి కంటి నరేష్ సిబ్బంది తో కలిసి మాటు వేసి అట్టి వ్యక్తుల వద్దగల రెండు కేజీల 350 గ్రాముల గంజాయి క్రయ విక్రయాలు జరుపుతూ పట్టుపడ్డారు.పట్టుబడిన గంజాయి విలువ రూ 58,750/ వరకు ఉంటుందని, నిందితుల వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు రెండు బైకులను స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసి కోర్ట్ నందు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.కార్యక్రమంలో సిఐ చరమందరాజు ఎస్సై చాలకంటి నరేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.