బాన్సువాడలో శ్రీ చైతన్య పాఠశాలకు నోటీసులు జారీ చేసిన ఎంఈవో...
బాన్సువాడలో శ్రీ చైతన్య పాఠశాలకు నోటీసులు జారీ చేసిన ఎంఈవో...
అక్షరవిజేత, కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని వీక్లీ మార్కెట్లో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు ఎంఈవో నాగేశ్వరరావు గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., పాఠశాలకు అనుమతులు లేకపోయినా విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేసి అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. సదరు పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు లేదని, విద్యార్థులను పాఠశాలలో చేర్పించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ అనుమతి ఉన్న పాఠశాలల్లోనే అడ్మిషన్లు పొందాలని సూచించారు. అవగాహన లేకుండా గుర్తింపులేని పాఠశాలల్లో చేర్పిస్తే భవిష్యత్తులో విద్యార్థుల చదువులకు ఇబ్బందులు ఏర్పడతాయని పేర్కొన్నారు.