తొలి రోజు ఎనిమిది మంది సర్పంచుల నామినేషన్ల స్వీకరణ..
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
పంచాయతీ ఎన్నికల సందర్భంగా తొలిరోజు పెద్ద శంకరంపేట మండలంలో గురువారం సాయంత్రం వరకు 8 మంది సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దరఖాస్తు చేసినట్లు పేట ఎంపీడీవో షాకీర్ అలీ తెలిపారు.. మండల కేంద్రమైన పెద్ద శంకరంపేట్.. కోలపల్లి.. రామోజీ పల్లి... మూసాపేట్ ఉత్తరూర్ . టెన్కటి గ్రామాలకు ఒక్కొక్క దరఖాస్తు చొప్పున ఈరోజు పల్లి సర్పంచ్ స్థానానికి రెండు నామినేషన్లు వచ్చాయని ఆయన వివరించారు.. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీనివాస్ ఆరే రమేష్ ఎంపీ ఓ క్రాంతి కుమార్ ఎన్నికల అధికారులు తదితరులు ఉన్నారు..