కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
పెద్ద శంకరంపేట్ మండల కేంద్ర పరిధిలోని రైతు వేదికలో ఈరోజు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులు మొత్తం 41 చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క పథకం అందే విధంగా మా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే గారు అన్నారు
గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడానికి 2 నుండి 3 సంవత్సరల వరకు సమయం పట్టేదని ఒక్కో చెక్కు అయితే అది కాంగ్రెస్ పార్టీ వారు అని తెలిస్తే చాలు ఆ చెక్కును ఇవ్వకుండా చింపేసిన రోజులు కూడా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు
మా ప్రజా ప్రభుత్వం కానీ నేను కానీ పార్టీలకు అతీతంగా ఒక ఆడబిడ్డను కష్టపెట్టాలని ఉద్దేశం దూర్బుద్ధితో లేకుండా ప్రతి ఒక్కరికి పార్టీతో సంబంధం లేకుండా చెక్కులను వచ్చిన వెంటనే వారికి అందజేస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రతి పేదవాడికి 10 లక్షల రూపాయల వరకు ఆసుపత్రి వైద్యానికి మా ప్రభుత్వం అందిస్తుందని దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించవలసింది ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు శంకరంపేట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉన్నతాధికారులు, మహిళలు, పాల్గొన్నారు