తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ నియామకం మల్లన్న ఆశీర్వాదంతో జిల్లాలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని సంకల్పం
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ మెదక్ జిల్లాకు ప్రవీణ్ కుమార్ ను జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న నియమించారు. పార్టీ విస్తరణ, గ్రామస్థాయి బలపరిచే కార్యక్రమాలు, కార్యకర్తల ఐక్యతను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ
తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు, మార్గదర్శకత్వంతోనే నేను జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తాను. నాపై నమ్మకం ఉంచి జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతను అప్పగించిన మల్లన్న కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
మెదక్ జిల్లా ప్రజలతో నేరుగా కలుస్తూ, వారి సమస్యలు తెలుసుకుని పార్టీ తరఫున వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాను. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు కార్యకర్తలతో సమన్వయంగా పని చేస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి చేరుస్తాను. త్వరలోనే సభ్యత్వ విస్తరణ కార్యక్రమం, గ్రామ సమావేశాలు, బూత్ స్థాయి బలపరిచి కార్యక్రమాలను చేపడతాం అని తెలిపారు.