*ఘనంగా బాలల దినోత్సవం* *పిల్లలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం*
అక్షర విజేత మాసాయిపేట
మెదక్ జిల్లా మాసాయి పేట మండల కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో పిల్లలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజు పిల్లలు పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠ్యాంశాలను నేర్పించడంలో ఉపాధ్యాయులు పిల్లలకు అన్ని విధాలలో బోధించడం జరుగుతుంది. తదనంతరం పిల్లలు పాఠశాలను వదిలి ఇంటికి వెళ్లాగానే తమ తల్లిదండ్రులు పిల్లలను గమనించవలసిన అవసరం తల్లిదండ్రులకు బాధ్యత అని చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల అవగాహన సదస్సులో సుమారుగా 70 మంది తల్లిదండ్రులు పాల్గొన్నారు. అదేవిధంగా చెట్ల తిమ్మాయిపల్లి లోని ఎం యు పి ఎస్ పాఠశాల యందు బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమంలో అలరించాయి, విద్యార్థుల ఆటలు , డ్రాయింగ్, స్పీచెస్, పాటలు, స్కిట్లు, అందరినీ ఆకట్టుకున్నాయి. గైడ్ టీచరుగా డాక్టర్ పాతూరి స్వప్నశ్రీ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు , మరియు మెదక్ జిల్లా టీఎస్జేఏ జనరల్ సెక్రెటరీ బొగ్గుల శివశంకర్, తల్లిదండ్రులు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు