క్రీస్తు బోధనలు ఆచరించండి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం (అక్షర విజేత)
పశ్చిమగోదావరి జిల్లా బ్యూరో: విశ్వాసులు క్రీస్తు బోధనలను ఆచరించి సన్మార్గంలో ముందుకు సాగాలని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లి గూడెం మండలం కుంచనపల్లి ఆటోనగర్ సమీపంలో నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ప్రార్థన మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఎవరు ఏ మతానికి చెందిన వారై నప్పటికీ పరమత సహనంతో తాము నమ్మిన భగవంతుడు చెప్పిన బోధనలపై నమ్మకం ఉంచి సన్మార్గంలో జీవితాన్ని సాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటు చేసి భగవంతున్ని ప్రార్థించిన తర్వాత తిరిగి ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలన్నారు. ప్రార్థన మందిరాలకు వెళ్లి వచ్చిన తరువాత కూడా అవే పొరపాట్లు కొనసాగిస్తే దేవుడు క్షమించడన్నారు. కల్వరి టెంపుల్ ప్రార్థన మందిర నిర్వాహకులు బ్రదర్ సతీశ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ క్షమా గుణం కలిగివుండాలన్నారు. విశ్వాసులు ప్రేమతో దయతో జీవనాన్ని కొనసాగించాలన్నారు. తాడేపల్లిగూడెంలో కల్వరి టెంపుల్ ఇంత అద్భుతంగా నిర్మాణం కావడానికి సహకరించిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా క్షేమం కోసం పరితపించే నాయకులు సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో కొనసాగాలని వారు ఆయురారోగ్యాలతో జీవించాలని సతీష్ కుమార్ దేవుడిని ప్రార్థించారు. మందిర నిర్మాణానికి సుదీర్ఘకాలం పడుతుందని భావించినప్పటికీ యేసయ్య దీవెనలతో తక్కువ రోజుల్లోనే నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గం లోని ప్రజలే కాకుండా జిల్లాలోని విశ్వాసం అందరూ కూడా ఈ మందిరానికి విచ్చేసి ప్రభువు ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. రూరల్ సీఐ రవికుమార్ బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించారు. కార్యక్రమంలో దైవజనులు అనిల్ కుమార్,ముఖ్య అతిథులు గా
పింటో, గ్రేస్ పింటో, రంగరాజు , చార్లెస్ జాకబ్, జనసేన నాయకులు కాళ్ళ గోపి, నీల పాల దినేష్ పాల్గొన్నారు.