కార్మికుల బకాయిలు చెల్లించేవరకు ఆర్వీఎం కంపెనీకి చెల్లింపులు ఆపాలి ఏఐటీయుసి నాయకులు సీతారామయ్య
అక్షర విజేత బెల్లంపల్లి నవంబర్ 13
మందమర్రి జీఎమ్ పరిధిలోని
కెకెఓసి ప్రాంతంలో ఆర్వీఆర్ కంపెనీ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు బకాయిలుగా ఉండగా, కంపెనీ తరఫున కార్మికులకు చెల్లించాల్సిన మొత్తం ఒకొక్కరికి రూ.5,500 చొప్పున బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదని ఎఐటీయుసీ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎఐటీయుసీ ఆధ్వర్యంలో కార్మికులు సమావేశమై సింగరేణి యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు. కార్మికులకు న్యాయం చేయకుండా ఆర్వీఎం కంపెనీకి సింగరేణి తరఫున బాకాయిలను విడుదల చేస్తే పెద్దఎత్తున ధర్నాలు, ఆందోళనలు చేపడతామని నేత సీతారామయ్య హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎండి నసిరద్దీన్ ప్రణయ్. పి శ్రీధర్ కే రమేష్, రాజకుమార్. ఎం ఉమేష్, ఏ సతీష్, రాజయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.