జిల్లా పోలీస్ సాయుధ నాకాబందీ జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీస్
అక్షర విజేత కృష్ణ
నారాయణ పేట జిల్లా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నాకాబంది నిషేధిత, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి అక్రమ రవాణా జరగడానికి వీల్లేదు అని నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దులోని గుడెబాల్లూరు గ్రామ కృష్ణ బోర్డర్ చెక్పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆధ్వర్యంలో నాకాబందీ చేపట్టబడింది ఈ తనిఖీలలో ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, మొత్తం 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, పోలీసు జాగిలాలతో బుధవారం రాత్రి 10:00 గంటల నుండి అర్ధరాత్రి 3:30 గంటల వరకు కొనసాగిన తనిఖీల్లో 367 వాహనాలు తనిఖీ చేసి పరిశీలించడం జరిగింది ఈ తనిఖీలలో భాగంగా పోలీసులు రెండు వరి ధాన్యంతో వస్తున్న లారీలు, ఒక ఇసుక లారీ, 200 లీటర్ల డీజిల్ ను పట్టుకొని స్వాధీనం చేసుకొని వారి పై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ వినీత్ మాట్లాడుతూ జిల్లా ఇతర రాష్ట్రాల సరిహద్దులు కలిగి ఉండడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు వచ్చే నిషేదించబడిన డ్రగ్స్ గంజాయి, గుట్కా, ఇసుక, అక్రమ మద్యం, ఇతర మాదక ద్రవ్యాలు పిడిఎస్ రైస్ వంటి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఏవైనా వస్తువుల అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక తనిఖీలు చేసినట్లు ఎస్పీ తెలియజేశారు. రాత్రి వేళల్లో అక్రమ వ్యాపారాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు మరియు దొంగతనాల నివారణకు, నిరంతరం తనిఖీలు కొనసాగిస్తున్నాము అని తెలిపారు. ఎవరు అక్రమ రవాణా లేదా చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు అని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. సరిహద్దు ప్రాంతాల్లో పహారా బలోపేతం చేయాలని పోలీసు అధికారులకు ఎస్పీ వినీత్ సూచించారు ఈ తనిఖీల్లో అదనపు ఎస్పి ఎండీ రియాజ్ హూల్ హాక్, డిఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, సీఐ లు రామ్ లాల్, రాజేందర్ రెడ్డి, ఎస్సై లు, పోలీసులు తది తరులు పాల్గొన్నారు.