*సేవా కార్యక్రమాల్లో కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు.*
అక్షరవిజేత,
నెల్లూరు బ్యూరో : కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల విద్యార్థులు, వాలంటీర్లు ఎన్ ఎస్ ఎస్ జాతీయ సేవా పథకంలో భాగంగా నెల్లూరు జిల్లా..టి పి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఈ నెల 5 వ తేదీ నుంచి 12 వరకు వారం రోజులు పాటు ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించడమైనది.ఇందులో భాగంగా మొక్కలు నాటడం.. వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం అలాగే ప్లాస్టిక్ వాడకం వలన జరిగే అనర్ధాలను గ్రామస్తులకు వివరించి.. ప్లాస్టిక్ నిషేధం పై అవగాహన కలిగించారు.పరిసరాల శుభ్రత గురించి ప్రజలకు వివరించి.. వైద్య శిబిరం నిర్వహించి.. గ్రామస్తులకు ఉచిత రక్త పరీక్షలు జరిపి.. మందులు పంపిణీ చేశారు.శిబిరం చివరి రోజున.. గ్రామస్తులకు నిత్యావసర వస్తువులు దుప్పట్లు పంపిణీ చేసి.. సేవా దృక్పథాన్ని చాటుకున్నారు.ప్రతి ఒక్కరూ విద్యార్థి దశ నుంచే సేవాభావం అలవర్చుకోవాలని వారు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల డీన్ సుధారాణి గారు,ఎన్ ఎస్ ఎస్ పి ఓ శ్రీహరి , షావలి, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.