*తల్లి లాంటి పార్టీ అధికారంలో ఉంటేనే బిడ్డలైన కార్యకర్తల భవిష్యత్ కు తిరుగుండదు : ప్రత్తిపాటి* .
చిలకలూరిపేట అక్షర విజేత
• మన నాయకుడి కష్టం.. కృషిలోనే రాష్ట్ర భవిష్యత్.. పార్టీ భవిష్యత్ ఇమిడిఉన్నాయనే నిజాన్ని ప్రతి కార్యకర్త గుర్తించాలి
• ప్రభుత్వ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమం, రాష్టానికి వస్తున్న పెట్టుబడులపై విస్తృత ప్రచారం జరగడం లేదనే అసంతృప్తితో అధినేత ఉన్నారు.
• చంద్రబాబు కష్టాన్ని గుర్తించి, వ్యక్తిగత అభిప్రాయాలు, అసంతృప్తులు పక్కనపెట్టి, సుదీర్ఘ లక్ష్యం కోసం కలిసికట్టుగా పనిచేద్దాం :
• నియోజకవర్గస్థాయి మండల, క్లస్టర్, బూత్, యూనిట్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి
తల్లి లాంటి పార్టీ అధికారంలో ఉంటే ఎప్పటికైనా బిడ్డల్లాంటి కార్యకర్తలకు తప్పక న్యాయం జరుగుతుందని, వారి భవిష్యత్ కు తిరుగు ఉండదని, ఈ సత్యాన్ని టీడీపీ కార్యకర్తలు, నాయకులు విధిగా గ్రహించాలని, మన నాయకుడు చంద్రబాబు మన పనితీరు సరిగా లేదని బాధపడుతున్నారని, చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేడర్ చురుగ్గాలేదనే అసంతృప్తితో అధినేత ఉన్నారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ లో జరిగిన నియోజకవర్గస్థాయి మండల, పట్టణ, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, వార్డు కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యఅతిథి హోదాలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. నియోజకవర్గ పరిశీలకురాలు దాసరి ఉషారాణితో కలిసి తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రత్తిపాటి.. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతర కేక్ కటింగ్ చేసి మైకుల చేత ప్రమాణ స్వీకారం అనంతరం పార్టీశ్రేణుల్ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేశారు.
.
తెలుగుదేశంతో పాటు మిత్రపక్షాలైన కూటమిపార్టీలను గౌరవించాలని, అప్పుడే మన నాయకుడు రాష్ట్రం కోసం, ప్రజల కోసం పడుతున్న శ్రమకు సార్థకత చేకూరుతుందని ఈ విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనని, కానీ ఎక్కడ లోపముందో వారు కూడా గమనించాలన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు, భేషజాలతో పార్టీకి నష్టం కలిగించే ఆలోచనల్ని అందరూ విడనాడాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు నాయకుడి కష్టాన్ని గుర్తించకుండా స్వప్రయోజనాలతో వ్యవహరిస్తున్నారన్నారు. ఇదే విధానం కొనసాగితే శ్రేణులతో పాటు పార్టీకి కూడా నష్టం వాటిల్లుతుందన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్టు కూటమిప్రభుత్వం 15 ఏళ్లు అధికారంలో ఉంటే, మూడు పార్టీల శ్రేణులకు ఎనలేని మేలు కలుగుతుందన్నారు.
*రాష్ట్రం, ప్రజలకోసం పదవులు, ప్రాధాన్యత అంశాల కోసం అసంతృప్తి, అసమ్మతి సరికాదు..*
పదవులు ఉన్నా లేకున్నా ఐక్యత చాలా ముఖ్యమన్న ప్రత్తిపాటి. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విషప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో కూడా పట్టుదలతో పనిచేయాలన్నారు. చంద్రబాబు, లోకేశ్ లు దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు రేయింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తోంది మన భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ కోసమేననే నిజాన్ని అందరూ అంగీకరించాలన్నారు. వయసును, ఆరోగ్యాన్ని ఖాతరు చేయకుండా ఆయన ఎవరికోసం కష్టపడుతున్నారో తెలుసుకోకపోతే మొదటికే మోసం వస్తుందన్నారు. మూడుపార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పదవుల సర్దుబాటులో చిన్నచిన్న అసంతృప్తులు ఉంటాయని, ఈ రోజు కాకుంటే రేపైనా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పనిచేయాలి గానీ, అసంతృప్తి, అసమ్మతితో వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు.
*పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటనలతో పాటు సోషల్ మీడియాలోనూ వైసీపీకి చెక్ పెట్టి పైచేయి సాధించాలి*
ఈ ఐదేళ్లలో చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇది లేదు అనే విధంగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు చెప్పిన ప్రత్తిపాటి, ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్య వీడిపోతే, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. సామాజిక పింఛన్ల పంపిణీలో ఏపీనే టాప్ లో ఉందన్న ప్రత్తిపాటి. తల్లికి వందనం సహా అధినేత సమర్థంగా అమలుచేస్తున్న పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తే, ఓటు బ్యాంకు పెంచుకోవడం పెద్దకష్టం కాబోదన్నారు. గత ఎన్నికల్లో నమోదైన ఓట్ షేర్ కంటే అదనంగా 10 శాతం పెరిగేలా ప్రతి కార్యకర్త, నాయకుడు విధిగా ప్రజలతో మమేకం కావాల్సిందేనని, ముఖ్యంగా పేదల సేవలో (పింఛన్ల పంపిణీ) కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందేనని ప్రత్తిపాటి తేల్చిచెప్పారు. టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా వ్యవహరించడంతో పాటు.. సోషల్ మీడియాలో వైసీపీ దుష్ప్రచారానికి చెక్ పెట్టడంలో మనదే పైచేయి అయ్యేలా మైండ్ కి పనిచెప్పాలన్నారు. పార్టీఆదేశాలు ఇవ్వకముందే వ్యక్తిగత అంశాల జోలికి పోకుండా, దుష్ప్రచారం చేయకుండా కేవలం పార్టీ ప్రజలకు చేస్తున్న మంచినే ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నియోజకవర్గానికి వీలైనన్ని నిధులు సాధించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రత్తిపాటి స్పష్టంచేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన పసుపు శ్రేణులకు భోజన ఏర్పాట్లు చేయించిన ప్రత్తిపాటి... వారితో మాట్లాడుతూ అక్కడే భోజనం చేశారు.