నేర నియంత్రణే కాదు రోడ్డు మరమ్మతులు కూడా..
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
నేర నియంత్రణే కాదు ప్రయాణికులకు కష్టాలు వస్తే రోడ్డు మరమ్మతులు కూడా చేపడతామని ఆత్మకూర్ సిఐ శివకుమార్ నిరూపించారు.వనపర్తి జిల్లా అమరచింత మండలం పరిధిలోని జూరాల ప్రాజెక్టు పై ఉన్న రోడ్డు గుంతలు పడడంతో ఆత్మకూర్ సిఐ శివకుమార్ గుంతల రోడ్డును మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సిఐ శివకుమార్ మాట్లాడుతూ మహబూబ్నగర్ నారాయణపేట గద్వాల్ జిల్లాలో నుంచి ప్రతినిత్యం వందల కొద్ది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని ప్రధాన జూరాల ప్రాజెక్టుకు సెలవు రోజుల్లో జూరాల ప్రాజెక్టుకు పర్యటకుల రద్దీ ఎక్కువగా ఉంటుందని జూరాల ప్రధాన రహదారులు ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని గుంతల్లో ఒక్క ట్రిప్పు కంకరతో పోసి చదును చేశారు. దీంతో ఈ రహదారి గుండా ప్రయాణించే అమరచింత ఆత్మకూర్ కానాపురం సింగంపేట మస్తీపూర్ ఈర్లదిన్నె నందిమల్ల మండలాల గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు తదితరులు పాల్గొన్నారు.