ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ విద్యా దినోత్సవం
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (అటానమస్) మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కె.అశోక్ మౌలానా అబుల్ కలాం చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం వారి జీవిత విశేషాలను తెలుపుతూ విద్య యొక్క ప్రాధాన్యతను విద్య గొప్పతనాన్ని సమాజాభివృద్ధికి విద్య ఏ రకంగా ఉపయోగపడుతుందో వివరించారు. వ్యక్తిగత అభివృద్ధి సమాజ అభివృద్ధి విద్యతోనే సాధ్యమవుతుందని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.