డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి భారీ జరిమానా . . . ఆరుగురికి జైలు శిక్ష
అక్షర విజేత, నిజామాబాద్
ప్రతినిధి : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారికి భారీగా జరిమానా విధింపుతో పాటు ఆరుగురికి జైలుశిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆలీ ఆదేశాల మేరకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 34 మందికి ట్రాఫిక్ సిఐ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరుపర్చగా 28 మందికి 2,69,000/- జరిమానా విధించారు. మిగితా ఆరుగురు వ్యక్తులు నగరానికి చెందిన షేక్ మునీరుద్దీన్, బుయ్యవాడి సందీప్ లకు మూడు రోజుల జైలు శిక్ష విధించగా, బిల్లి కాడి శివ, అతుల్ గోపీచంద్ లకు నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. షేక్ హర్షద్ తండ్రి, శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తులకు ఏడు రోజుల జైలు శిక్ష విధించడం జరిగిందని సిఐ తెలిపారు.