చిలకలూరిపేటనారాయణ స్కూల్ లో స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం
చిలకలూరిపేట అక్షర విజేత
నారాయణ స్కూల్ చిలకలూరిపేట లో నవంబర్ 7 నుంచి 8 వరకు స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులు ముందుంచి ప్రదర్శించారు.
ప్రధాన అతిథిగా ప్రిన్సిపాల్ కే. శేషగిరి రావు కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ నాగవర్ధిని, జెడ్ సి ఓ గౌసియా ఏ జి ఎం లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు విద్యార్థులు తమ తరగతుల్లో చేసిన ప్రాజెక్టులు అసైన్మెంట్లు మరియు క్రియేటివ్ వర్క్ ను తల్లిదండ్రుల ముందుంచారు ప్రతి విద్యార్థి తన నేర్చుకున్న అంశాలను ఆత్మవిశ్వాసంతో వివరించారు తల్లిదండ్రులు విద్యార్థుల ప్రదర్శనలను ఎంతో ఆసక్తిగా వీక్షించి ప్రిన్సిపాల్ కితమ అభిప్రాయాలు అందజేశారు వారు ఈ ఎస్ ఎల్ సి కార్యక్రమం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు ధైర్యం మరియు నేర్చుకునే విధానం మెరుగవుతున్నాయని ప్రశంసించారు.
చివరగా ప్రిన్సిపాల్ కె శేషగిరి రావు ఎస్ ఎల్ సి ప్రాముఖ్యతను వివరించి విద్యార్థుల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు