కుక్కల బెడద తీరేదెన్నడో? పూర్తి స్ధాయిలో నియంత్రణ చేపట్టని అధికారులు.
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి.
వనపర్తి జిల్లా కేంద్రంలో రోడ్ల మీద ప్రయాణించాలంటే భయబ్రాంతులకు గురవుతున్న ప్రజలు
జిల్లాలో వీధి కుక్కల బెడద అధికమైంది. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ చిన్నా పెద్ద అని తేడా లేకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లా కేంద్రం లో విద్యా సంస్థలు ఆసుపత్రిలో బస్ స్టేషన్ ప్రజలు రద్దీగా ఉన్న ప్రదేశాలలో సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి దీంతో రోడ్లమీద ప్రయాణించాలంటేనే ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారు. మున్సిపాలిటీల లో పలు వీధుల్లో కుక్కల సంతతి పెరిగింది. గతంలో కుక్కలను బంధించి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడం లాంటివి చేసేవారు. ప్రస్తుతం ఆ తరహ చర్యలు కనిపించడం లేదు. కుక్కలను చంపకుండా వాటి సంతతిని పెరగకుండా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉండగా వాటిని సైతం ఎక్కడా అమలు చేసిన దాఖాలాలు లేవు. ఇప్పటికీ వీధి కుక్కలు సర్వ విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి మున్సిపల్ అధికారులు వాటి నియంత్రణకు మాత్రం చర్యలు కరువయ్యాయి.