తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ లో యువతకు ప్రాధాన్యత ... రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర రవికుమార్
అక్షర విజేత,
నిజామాబాద్ ప్రతినిధి : తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలుకర రవికుమార్ అన్నారు శనివారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జిల్లాలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ లో చేరడానికి చాలా మంది ఆసక్తి చూపెడుతున్నారు అన్నారు. రాజకీయ నాయకులుగా మంచి నాయకత్వం గల నాయకులను తయారు చేయడం జరుగుతుంది అన్నారు. అత్యధికంగా యువత కలిగిన మన రాష్ట్రములో చాలామంది యువకులు విద్యకు తగిన ఉద్యోగం లేకుండా సరైన ఉపాధి లేకుండా నష్టపోతున్నారు. ఇలా జరగకుండా ఉండాలి అంటే యువత రాజకీయరంగ ప్రవేశం చేయాలి. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పక్క లోకల్ అన్నారు. లోకల్ యువతకు చైతన్యవంతం చేయడమే తమ లక్ష్యం అన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయవచ్చు . కాబట్టి ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం ఇవ్వాలి . కాబట్టి ఈ యొక్క మార్పు పల్లెల్లో నుంచి పట్టణం వరకు చేరాలి గల్లి నుండి ఢిల్లీ వరకు చేరాలి అన్నారు.రాష్ట్ర నాయకులు రిటైర్డ్ ఐఐఎస్ కూనప రెడ్డి హరిప్రసాద్ ఆఫీసర్ రాష్ట్ర మహిళా నాయకులు విజయ రెడ్డి, ఉదయ సింగ్ తదితరులు పాల్గొన్నారు.